బుల్డోజర్లతో నేలమట్టం : మంచిర్యాల జిల్లాలో 5 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు.. ఓ సర్వే నెంబర్ పై అనుమతి తీసుకుని.. మరో సర్వే నెంబర్ లో నిర్మాణాలు.. పదే పదే నోటీసులు ఇచ్చినా స్పందించని వైనం.. మూడేళ్లుగా నిర్మాణం ఆపమని పదే పదే చెప్పినా వినకుండా.. అక్రమంగా ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు ఆ కార్మిక సంఘం నాయకుడు. ఈ క్రమంలోనే నిర్మాణం పూర్తయిన ఈ ఐదు అంతస్తుల భవనాన్ని.. 2024, సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం.. నస్పూర్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. భారీ బుల్డోజర్లతో బిల్డింగ్ ను పడగొట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో పరిధిలోని సర్వే నెంబర్ 42లో ఈ ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉంది. సర్వే నెంబర్ 40 పేరుతో.. ఆ డాక్యుమెంట్లలో పర్మీషన్ తీసుకున్నారు యజమానులు. సర్వే నెంబర్ 40లో నిర్మాణాలు చేయకుండా.. సర్వే నెంబర్ 42లో ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టేశారు. 

2022లోనే ఈ విషయాన్ని గుర్తించిన నస్పూర్ మున్సిపల్ సిబ్బంది.. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు జారీ చేశారు. అధికారుల నోటీసులను సైతం లెక్కచేయకుండా.. డోంట్ కేర్ అంటూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అడ్డగోలుగా.. అక్రమంగా బిల్డింగ్ కట్టేశాడు యజమాని. 

ALSO READ : జలవిహార్ ఆక్రమణలపై చర్యలు తీసుకోండి : సీపీఐ

పదే పదే నోటీసులు ఇచ్చినా.. నిర్మాణాలు కొనసాగిస్తుండటంతో.. నస్పూర్ మున్సిపల్ అధికారులు యాక్షన్ లోకి దిగారు. బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నోటీసులు వచ్చినా.. ఓ రాజకీయ నేత పలుకుబడితో నిర్మాణాలు కొనసాగించాడనేది లోకల్ టాక్.