- నూనె, పప్పుదినుసులు, పసుపు, కారంపొడి సహా ఇతర వస్తువుల అపహరణ
- ఇన్చార్జి ప్రిన్సిపాల్, పీఈటీ, అటెండర్లే సూత్రదారులు
- పోలీస్ స్టేషన్చేరిన వ్యవహారం
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్మండలం జిల్లెలగడ్డలోని ట్రైబల్వెల్ఫేర్రెసిడెన్షియల్స్కూల్, జూనియర్కాలేజీలో 30 క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయి. వీటితోపాటు వంటనూనె, పప్పుదినుసులు, పసుపు, కారంపొడిని కూడా అపహరించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్మధు, పీఈటీ చందూలాల్, అటెండర్రమేశ్, వర్కర్లు వల్లకట్ట అరుణ, యాద రేణుక సహకారంతోనే ఇదంతా జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. పరీక్షలు కంప్లీట్కావడంతో స్కూల్ స్టూడెంట్స్కు సెలవులు వచ్చాయి.
కాలేజీ స్టూడెంట్స్కు పలు కోర్సుల్లో సమ్మర్ కోచింగ్ఇస్తున్నారు. తక్కువ మంది స్టూడెంట్స్ఉండడంతో వారంతా హాస్టల్రూముల్లో ఉంటున్నారు. దీంతో స్టోర్ రూంలో బియ్యాన్ని ఎలుకలు కొడుతున్నాయని వరండాలోకి తెచ్చారు. ఎవరైనా అడిగితే లోపల ఎలుకలు ఉన్నాయని చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రోజుకు పది క్వింటాళ్ల చొప్పున బియ్యాన్ని, పప్పుదినుసులు, నూనెడబ్బాలు, పసుపు, కారంపొడిని ఎత్తుకెళ్లారు.
ఇన్చార్జి ప్రిన్సిపాల్ సహకారంతోనే ఇదంతా జరిగినట్టు చెబుతున్నారు. ఈ విషయమై ఆయనను వివరణ కోరగా వర్కర్లే బియ్యాన్ని తీసుకెళ్లారన్నారు. అయితే తనకు ఎలుకలు కొట్టిన బియ్యాన్ని తీసుకెళ్లినట్టు తెలిసిందని, స్టోర్ రూంలో బియ్యం మాయమైనట్టు ఇప్పుడే తెలిసిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సీఐ శ్రీనివాస్తెలిపారు. వారి ఆదేశాలను బట్టి నిందితులపై చర్యలుంటాయన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్ డిమాండ్ చేశారు.