మనోహరాబాద్, వెలుగు: మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 30 మంది యువకులు మంగళవారం రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, బీజేపీ జిల్లా కార్యదర్శి బాషబోయిన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
వీరికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కుచారం మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ చారి పాల్గొన్నారు.