సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 161పై వెళ్తున్న ఓ బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణిస్తున్న దంపతులతోపాటు వారి కుమారుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రాంసానీ పల్లి సమీపంలో చోటుచేసుకుంది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో మరణించిన వారిని.. మద్నూర్ మండలం పెద్ద తాడ్కూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్(35), అతని భార్య సునీత(30), కుమారుడు నాగేష్(07)లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.