సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి రూ.2,357.14 కోట్లు

  •  రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్​కు రూ.502 కోట్లు

న్యూఢిల్లీ: సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ప్రభుత్వం బడ్జెట్ లో రూ.2,357.14 కోట్లను కేటాయించింది. రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ కోసం రూ.502 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపింది. 22 ఎయిర్ పోర్టుల పునరుద్ధరణ,124 ఆర్ సీఎస్ రూట్స్, నార్త్ ఈస్ట్ కనెక్టివిటీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కు ఈ నిధులను అలాకేట్ చేస్తున్నట్టు చెప్పింది. డ్రోన్, డ్రోన్ కాంపోనెంట్ల కోసం పీఎల్ఐ స్కీమ్ కింద అత్యధికంగా రూ.57 కోట్లను కేటాయించింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు రూ.302.64 కోట్లు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఏస్)కు రూ.89 కోట్లను అలాకేట్ చేసింది. ఎయిర్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ బెనిఫిట్స్ అందించడానికి బడ్జెట్ లో రూ.85 కోట్లు కేటాయించింది. దీనిని ప్రభుత్వం 2022లో టాటా గ్రూప్‌కు విక్రయించింది.