లోక్​అదాలత్​లో 2,302 కేసులు పరిష్కారం : లక్ష్మీశారద

  •     జిల్లా ప్రధాన జడ్జి లక్ష్మీశారద

మెదక్​టౌన్, వెలుగు : రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం ఎంతో శ్రేయస్కరమని జిల్లా ప్రధాన జడ్జి లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లాలోని కోర్టుల్లో జాతీయ లోక్​అదాలత్​ను నిర్వహించారు. ఈ సందర్భంగా 2,302  కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. లోక్ అదాలత్,  న్యాయ సహాయం

సీనియర్ సిటిజన్స్ యాక్ట్, విక్టిమ్స్ కంపెన్సేషన్, నల్సా స్కీమ్స్ ఫర్ ఉమెన్, చైల్డ్ రైట్స్ తదితర చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్​ సివిల్​ జడ్జి జితేందర్​, జూనియర్​ సివిల్​ జడ్జి రీటా లాల్​చంద్​, మార్నింగ్​ కోర్టు జడ్జిలు సిద్దయ్య, స్వాతి, మెదక్​బార్​అసోసియేషన్​ ప్రెసిడెంట్​ సుభాష్​ చంద్రగౌడ్​ పాల్గొన్నారు.

ఖేడ్​లో 473 కేసులు పరిష్కారం

నారాయణ్ ఖేడ్: ఖేడ్ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో473 కేసులు పరిష్కరించినట్లు జడ్జి మంథని శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గం అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సారెడ్డి, లాయర్లు, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

68 కేసులు పరిష్కారం

జహీరాబాద్ : మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ ఆధ్వర్యంలో స్థానిక కోర్ట్ కాంప్లెక్స్ లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 68 కేసులు పరిష్కరించినట్టు సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ తెలిపారు.  సీనియర్ కోర్టు విభాగంలో 29 బ్యాంకు, 10 సైబర్ క్రైమ్ కేసులు, జూనియర్ కోర్టు విభాగంలో ఒక సివిల్, 8 క్రిమినల్ కాంపౌండ్, 1 సెకండ్ క్లాస్ కేసు, 5 అడ్మిషన్ కేసులు,14 ఎక్సైజ్​కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.