ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్ .. కొత్త ఫీచర్లతో 450 సిరీస్ స్కూటర్లు లాంచ్

ఎలక్ట్రిక్​ వెహికల్స్​ తయారీ సంస్థ ఏథర్  కొత్త అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో తీర్చిదిద్దిన 2025 ఏథర్ 450 సిరీస్​ ఈ–స్కూటర్లను లాంచ్​చేసింది. 2025 ఏథర్ 450ఎస్​ ధర రూ. 1,29,999 (ఎక్స్​షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. అయితే 2.9 కిలోవాట్​అవర్​ బ్యాటరీతో కూడిన 2025 ఏథర్ 450ఎక్స్​ ధర రూ. 1,46,999 కాగా, 3.7 కిలోవాట్​ అవర్​ బ్యాటరీ గల ఏథర్ 450 ఎక్స్​ ధర రూ. 1,56,999  ఉంటుంది. 

ఎపెక్స్​మోడల్​ధర రూ.రెండు లక్షలు. ఇందులోని మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్​వల్ల రైడర్లు థ్రోటిల్‌‌‌‌ని మాత్రమే ఉపయోగించి బ్రేక్, యాక్సిలరేట్ చేయవచ్చు. మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్  వీలు జారడాన్ని ఆపడంలో సహాయపడుతుంది. యూజర్​ అవసరాలకు తగ్గట్లుగా రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్​లు ఉంటాయి.