18 మంది జూనియర్​ అసిస్టెంట్లకు పోస్టింగ్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: జిల్లాలో ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా జూనియర్ అసిస్టెంట్లుగా ఎంపికైన 18 మంది అభ్యర్థులకు కలెక్టర్​రాజర్షి షా మంగళవారం పోస్టింగ్​ఆర్డర్స్​ అందజేశారు. ఈ సందర్భంగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్​ పోస్టింగులు అందజేశారు. అడిషనల్ ​కలె క్టర్ శ్యామలాదేవి, ఏఓ బి.రాంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.