రూ.27 లక్షలతో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు : ఆడే గజేందర్

నేరడిగొండ, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని వివిధ కాలనీల్లో రూ.27 లక్షల విలువైన 18 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్​చార్జ్ మంత్రి సీతక్క సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు

కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా పనిచేస్తోందని ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడే వసంతరావు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, మండల మైనార్టీ చైర్మన్ వకీల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కపిల్ దేవ్, బోథ్ మాజీ ఎంపీటీసీ కుర్మే మహేందర్, మండల యూత్ అధ్యక్షుడు హీరా సింగ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.