తెలంగాణలో 2030 నాటికి 16 లక్షల జాబ్స్

హైదరాబాద్, వెలుగు:  నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం, పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా తెలంగాణ విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘బ్రిడ్జింగ్ ది గ్యాప్: ఇంటిగ్రేటింగ్ స్కిల్లింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌టు తెలంగాణాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిపోర్ట్’ ఈ విషయం తెలిపింది. దీనిని -ఈవై–పార్థెనాన్ సహకారంతో  తెలంగాణ సీఐఐ రూపొందించింది.   

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2023–-24లో  187 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని,  2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. దీనివల్ల 2030 నాటికి కొత్తగా 16 లక్షల ఉద్యోగాలు వస్తాయి.  ప్రభుత్వం  యువతకు లైఫ్ సైన్సెస్, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, డిఫెన్స్ వంటి  రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తోందని రిపోర్ట్​ పేర్కొంది.