గ్రూప్1 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: ల్లాలో ఈనెల 9 న జరిగే గ్రూప్- 1 ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్స్ మూసివేయాలన్నారు.  పరీక్ష సెంటర్స్ పరిధిలో 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్/గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.