గుండెపోటుతో పన్నెండేండ్ల చిన్నారి మృతి

  • మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఘటన

చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మానగర్  కాలనీకి చెందిన పన్నెండేండ్ల చిన్నారి ఆడుకుంటుండగానే హార్ట్​ ఎటాక్​ రావడంతో చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. కస్తూరి రమ, శ్రీనివాస్  దంపతుల పెద్ద కూతురు నివృతి(12) పట్టణంలోని ప్రైవేట్​ స్కూల్​లో ఏడవ తరగతి చదువుతోంది.

శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్కూల్​కు సెలవు కావడంతో తమ్ముడితో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటుండగా, కళ్లు తిరుగుతున్నాయని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. అంతకుముందు ఎలాంటి జబ్బు లేని నివృతి గుండెపోటుతో చనిపోవడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది.