నిజాంపేట గ్రామాంలో పిడుగు పడి 12 గొర్రెలు మృతి

దుబ్బాక, వెలుగు: పిడుగు పడి 12 గొర్రెలు మృతి చెందాయి. సిద్దిపేట జిల్లా అక్భర్​పేట-భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన కోనాపురం పెంటయ్య తన గొర్రెలు, మేకలను మంగళవారం మేత కోసం అడవి ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఈ క్రమంలో గొర్రెల మందపై పిడుగు పడడంతో 12 గొర్రెలు, మేక పిల్ల అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల విలువ సుమారు రూ. లక్షా 50 వేల వరకు ఉంటుందని,  ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. 

ఆవు మృతి..

సిద్దిపేట రూరల్: పిడుగుపాటుకు ఆవు మృతి చెందిన సంఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని మల్యాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బండారి కనకయ్య తన వ్యవసాయ పొలం వద్ద ఆవును కట్టేసి ఇంటికి వెళ్లగా మంగళవారం సాయంత్రం పిడుగు మీద పడడంతో ఆవు మరణించింది. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు.