- 35 తులాల గోల్డ్, రూ.15.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న బెల్లంపల్లి పోలీసులు
మంచిర్యాల, వెలుగు : డాక్టర్ ఇంట్లో జరిగిన చోరీ కేసులో మంచిర్యాల జిల్లా పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద 35 తులాల బంగారం, రూ.15.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఏ.భాస్కర్ ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద తన హాస్పిటల్ పైన డాక్టర్ విజయబాబు ఉంటున్నాడు. గత నెల 3న ఆయన బర్త్‌డే సందర్భంగా నార్త్ ఇన్ హోటల్లో వేడుకలు నిర్వహించగా.. ఇంటికి లాక్ చేసి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి దొంగలు పడ్డారు.
బెడ్రూమ్ లోని లాకర్‌ను గ్రైండింగ్ మెషీన్‌తో కట్ చేసి 44 తులాల బంగారం, రూ.15.50 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి డాక్టర్ విజయబాబు పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసిన సీఐ ప్రమోద్ రావు నాలుగు టీమ్ తో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం ముఖరం చౌరస్తా వద్ద నిందితులను పట్టుకున్నట్టు డీసీపీ తెలిపారు.