సొంత ఖర్చులతో యువత రోడ్లకు రిపేర్లు

దహెగాం, వెలుగు: తమ సొంత ఖర్చులతో దహెగాం యువత రోడ్లకు రిపేర్లు చేయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ఇంటర్నల్ ​రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గుంతలు పడి వెహికల్స్ వెళ్లడానికి కష్టంగా మారడంతో కలెక్టర్, ఆర్అండ్​బీ అధికారు లకు వినతిపత్రాలు అందజేశారు. ఫండ్స్​ లేకపోవడంతో పనులు లేట్​ అవుతాయని అధికారులు చెప్పడంతో యువకులు తలో కొంత చందాలు వేసుకొని రూ.1.20 లక్షలు జమచేసి రోడ్డు రిపేర్లకు పూనుకున్నారు. యూత్​ చేసిన పనిని గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు.