కోల్‌బెల్ట్, వెలుగు: జాబ్ రావట్లేదని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. మందమర్రి టౌన్ అంగడి బజార్‌కు చెందిన కోయల్కర్భరత్(28) బీటెక్ చేశాడు. కొంతకాలంగా సాఫ్ట్వేర్జాబ్ కోసం ఇంటార్వ్యులకు హాజరైనా జాబ్రావడంలేదు. దీంతో మనస్తాపం చెందిన భరత్శనివారం ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే కుటుంబసభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం భరత్ మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు మందమర్రి ఎస్ఐ తెలిపారు.