న్యూఢిల్లీ: బ్రిటిష్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండస్ టవర్స్‌లో మూడు శాతం వాటాను అమ్మనుంది. ఈ డీల్విలువ రూ.2,841 కోట్లు. దాదాపు రూ. 856 కోట్ల రుణాన్ని చెల్లించడానికి ఈ డబ్బును ఉపయోగించుకోనుంది. మిగతా డబ్బును భారతీయ వెంచర్ వోడాఫోన్ ఐడియా బకాయిలు చెల్లించడానికి వాడుతుంది. వొడాఫోన్ గ్రూప్ పీఎల్సీ తన మిగిలిన 79.2 మిలియన్ షేర్లను ఇండస్ టవర్స్ లిమిటెడ్‌లో ఉంచినట్లు ప్రకటించింది.
ఈ ఒప్పందం తరువాత ఇండస్ టవర్స్‌లో వోడాఫోన్ వాటా 1 శాతం దిగువకు పడిపోతుంది. ఈ ఏడాది జూన్‌లో వొడాఫోన్ ఇండస్ టవర్స్‌లో 18 శాతం వాటాను దాదాపు రూ.15,300 కోట్లకు విక్రయించింది.