రోడ్డు పనుల్లో జాప్యం.. గ్రామస్తుల ఆందోళన

కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనుల్లో జాప్యం కారణంగా గ్రామస్తులు, కాంట్రాక్టర్లకు మధ్య బుధవారం గొడవ జరిగింది. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన తమకు ఇంతవరకు నష్టపరిహారం అందకపోవడం, పనులు ముందుకు సాగకపోవడంతో మురుగు నీరు ఇండ్లలోకి చేరి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని బాధితులు గొడవకు దిగారు. 

దీంతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు కొమ్ము విజయ్ , గ్రేటర్ హైదరాబాద్ జాగృతి ప్రధాన కార్యదర్శి అనంతల ప్రశాంత్ జోక్యం చేసుకుని సమస్యల పరిష్కరించాలని అధికారులను కోరారు. దీంతో గొడవ సద్దుమణిగింది.