దేశాభివృద్ధికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దిక్సూచిగా మారిందని వక్తలు కొనియాడారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు రాజకీయ నాయకులు, వివిధ కుల సంఘాల, ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
బడుగు, బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు హక్కులు కల్పించారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషిచేయాలన్నారు. - వెలుగు నెట్వర్క్