గణనాథులను దర్శించుకున్న ఎంపీ వంశీకృష్ణ

కోల్‌బెల్ట్‌/బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల, బెల్లంపల్లి, నెన్నెల ప్రాంతాల్లో ఆదివారం పెద్దపల్లి గడ్డం ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం, ఎల్ఐసీ కాలనీలో గణేశ్ మండపం, నెన్నెలలోని బెస్తవాడలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ, గణేశ్‌ మండప నిర్వాహకులు, స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఎంపీని శాలువాలతో సన్మానించారు. విఘ్నాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధి జరగాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో  జీవించాలని వినాయకుడిని కోరుకున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. నెన్నెల మండల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ లీడర్ల మృతి తీరని లోటు

కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్ల మరణాలు పార్టీకి తీరని లోటు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్‌ బస్తీకి చెందిన మల్లయ్య, బజార్‌ ఏరియాకు చెందిన చక్రపాణి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. బాధిత కుటుంబాలను ఆదివారం ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. చనిపోయిన వారి ఫొటోలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వీరిద్దరూ యాభై ఏండ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తుచేశారు.

అలాగే నెన్నెల మండలంలోని కుశ్నపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సంధ్య- మహేశ్‌రెడ్డి మామ మల్లారెడ్డికి చనిపోవడంతో ఆయన ఫొటో వద్ద నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఎంపీ వెంట బెల్లంపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ రాజలింగు యాదవ్, సేవాదళ్ జిల్లా మాజీ చైర్మన్‌ బండి రాము, కాంగ్రెస్ నెన్నెల మండల అధ్యక్షుడు గట్టు మల్లేశ్‌, గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ బొమ్మెన హరీశ్‌గౌడ్‌, తోట శ్రీనివాస్, నర్సింగరావు, మల్లాగౌడ్, శ్యామ్, పోచంపల్లి హరీశ్‌ ఉన్నారు.