ఆదిలాబాద్లో ఘనంగా పోలీస్​ ఔట్​పాస్ ​పరేడ్

  • శిక్షణ పూర్తిచేసుకున్న 254 మంది ఎస్పీటీసీసీ సివిల్ ​కానిస్టేబుళ్లు
  • నిజాయితీగా విధులు నిర్వహించాలి: రాష్ట్ర పీఅండ్ఎల్ ఐజీ ఎం.రమేశ్ 

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : ఆదిలాబాద్​ పట్టణంలోని పోలీస్​ పరేడ్ ​గ్రౌండ్​లో గురువారం పోలీస్​ ఔట్ ​పాస్​పరేడ్ ​వేడుకలు పోలీసులు ఘనంగా నిర్వహించారు. పీఅండ్ఎల్​ఐజీ ఎం.రమేశ్ ​చీఫ్​గెస్ట్​గా హాజరై వేడుకలు ప్రారంభించారు. అంతకు ముందు ఎస్పీ గౌస్​ఆలం, కలెక్టర్ రాజర్షి షా, రెండో బెటాలియన్ కమాండెంట్​ నితిక పంత్, శిక్షణ ఐఏఎస్ అధికారి అభిజ్ఞాన్ ఐజీకి స్వాగతం పలికారు. సూర్యాపేట జిల్లా నుంచి 129 మంది, రాజన్న సిరిసిల్ల 35, జగిత్యాల 34, ములుగు 16, సంగారెడ్డి 15 మంది, సైబరాబాద్ నుంచి 25 మంది మొత్తం 254 మంది ఎస్సీటీపీసీ సివిల్​ కానిస్టేబుళ్లు ఇక్కడ 9 నెలల పాటు ఇండోర్, ఔట్​డోర్ విభాగాల్లో 

శిక్షణ పొంది తాజాగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శిక్షణలో పలు పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి షీల్డ్​లు, ప్రశంసా పత్రాలను ఐజీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని ఉల్లంఘించకుండా, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. వీరికి శిక్షణ అందించిన 50 మంది పోలీసులు, వైద్య సిబ్బంది, న్యాయాధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. 

పోలీస్​ శిక్షణ కేంద్రం అడిషనల్​ఎస్పీ, శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ సి.సమయ్ జాన్ రావు, అడిషనల్​ఎస్పీ (ఆపరేషన్స్) బి.సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, బి.సురేందర్ రెడ్డి, ప్రకాశ్, సర్కిల్, రిజర్వ్, సబ్ ఇన్​స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.