మంచిర్యాల, వెలుగు: విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నౌండ్ల సంతోష్ చారి, నాయకులు ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. వారికి డీసీసీ చైర్పర్సన్ కొక్కిరాల సురేఖ తమ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్లో చేరిన వారిలో కుంట్ల శ్రీనివాసాచారి, సజ్జనపు జగదీశ్వరాచారి, తాటికొండ రాజేశం చారి, మాటూరి సత్యనారాయణ చారి, శ్రీమంతుల రాజవీరు చారి, శ్రీరామోజు సంతోష్ చారి, తొలికుంట్ల రాజాచారి, మునిగంటి శ్రీనివాస్ చారి, శ్రీరామోజు రాజమొగిలి చారి, మట్టల రమేశ్ చారి ఉన్నారు.