హీరో ఎలక్ట్రిక్​పై దివాలా ప్రక్రియ

న్యూఢిల్లీ: మెట్రో టైర్స్​ కంపెనీకి రూ.1.85 కోట్లు చెల్లించడంలో విఫలమైన హీరో ఎలక్ట్రిక్​కు వ్యతిరేకంగా దివాలా ప్రక్రియను మొదలు పెట్టాలని నేషనల్​ కంపెనీ లా ట్రిబ్యునల్​(ఎన్సీఎల్టీ) ఆదేశించింది. కంపెనీ బోర్డును రద్దు చేయడమేగాక తాత్కాలిక నిర్వహణ బాధ్యతలు  చూసేందుకు ఇంటెరిమ్​ రిజల్యూషన్​ప్రొఫెషనల్​గా భూపేశ్​ గుప్తాను నియమించింది.

మెట్రో టైర్స్​తో తమకు ఎప్పటి నుంచో వివాదం ఉందని, దివాలా ప్రక్రియ అవసరం లేదన్న హీరో ఎలక్ట్రిక్​  వాదనను తోసిపుచ్చింది. ఈ కంపెనీ మైట్రో టైర్స్​ నుంచి 2022 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు రూ.3.69 కోట్ల విలువైన సైకిల్​ టైర్లను, ట్యూబులను కొన్నది. ఈ మొత్తంలో రూ.1.85 కోట్లు చెల్లించలేదని కంపెనీ ఫిర్యాదు చేసింది.