మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్ లో  ఇటీవలే  అనారోగ్యంతో మృతి చెందిన  కాంగ్రెస్  సీనియన్ నాయకులు నల్ల చక్రపాణి, గొడుగు మల్లయ్య చిత్రపటాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ  పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి  కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 వంశీకృష్ణతో పాటు బెల్లంపల్లి మున్సిపల్  కౌన్సిలర్లు, తాండూరు మండల అధ్యక్షుడు ఎండి ఈసా, బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.