- ఎమ్మెల్యే వివేక్ ఆదేశాలతో పర్మినెంట్ పనులకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్న ఇరిగేషన్ శాఖ
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూర్ పట్టణ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు డిటోనేటర్లతో పేల్చివేసిన శనిగకుంట చెరువు మత్తడికి బుధవారం తాత్కాలిక రిపేర్లు చేశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్ఆధ్వర్యంలో రిపేర్లు చేపట్టారు. 44 మీటర్ల పొడవైన మత్తడి 39 మీటర్ల వరకు పూర్తిగా ధ్వంసం కాగా దాదాపు వెయ్యి ఇసుక బస్తాలను మత్తడిపై వేసి టెంపరరీ రిపేర్లు పూర్తిచేశారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో పర్మనెంట్ పనుల కోసం అవసరమైన ప్రతిపాదనలు రెడీ చేస్తున్నామని ఇరిగేషన్ డీఈ తెలిపారు. స్థానిక కాంగ్రెస్ లీడర్లు హేమంత్ రెడ్డి, సుశీల్ కుమార్, మహేశ్తివారీ, పాతర్ల నాగరాజు, చెన్న వెంకన్న, అన్వర్తదితరులు పనులు వద్ద పర్యవేక్షణ చేశారు. చెరువు మత్తడిని పేల్చివేసిన ఘటనను చెన్నూర్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపు లోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం.