బాసరలో కేంద్రీయ  విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయండి : ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, వెలుగు: చదువుల తల్లి సరస్వతి కొలువుదీరిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వినతి పత్రం అందజేశారు.

బాసరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ముథోల్ నియోజవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. స్పందించిన కేంద్రమంత్రి బాసరలో యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పటేల్ తెలిపారు.