ఏఐతో మరింత మెరుగ్గా హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: శ్రీధర్ బాబు

  • రాష్ట్రాన్ని ఏఐ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చడంపై  ఫోకస్ పెట్టాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపురేఖలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏఐ) టెక్నాలజీతో మార్చాలని  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్  దుద్దిళ్ల శ్రీధర్ బాబు  పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఏఐ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూ బయోఏషియా 2025’ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించారు.  డయాగ్నోస్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నుంచి పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెరుగైన చికిత్స అందించడం వరకు ఏఐ సాయపడుతుందని అన్నారు.  ఏఐతో సమర్ధవంతమైన హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయొచ్చని, తమ ప్రభుత్వం ఇన్నోవేషన్లను ప్రోత్సహిస్తోందని తెలిపారు. 

‘ఏఐకి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణను మార్చేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నాం. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్యలను పరిష్కరించేందుకు  ప్రభుత్వం, నిపుణులు,  ఇండస్ట్రీ కలిసి పనిచేయాలి. ఏఐ, బయోటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డేటా సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీలను డెవలప్ చేస్తున్న కంపెనీలకు సిటీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది’ అని  శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఏఐని డెవలప్ చేసేందుకు   ఏఐ అడ్వైజరీ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశామని, ఏఐ వృద్ధిని ఈ కౌన్సిల్ చూసుకుంటుందని వివరించారు. ఏఐ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  తయారు చేసేందుకు వివిధ దేశాల్లోని పాలసీలను విశ్లేషిస్తున్నామన్నారు.