3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వైద్యం

బజార్​హత్నూర్, వెలుగు: బజార్​హత్నూర్ మండలం చిన్నమియా తండాలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందు కోసం డాక్టర్లు గుట్టపై ఉన్న తండాకు టింబి గ్రామం నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గిరిజనులు వైద్యం అందించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని , సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి పీహెచ్ సీ డాక్టర్ భీంరావు సూచించారు.

డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. తండాలోని 50 మంది గిరిజనులకు సాధారణ చికిత్స చేసి, 12 మంది జ్వర పీడితులకు రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. హెచ్ ఈవో సూర్యప్రకాశ్, ఎంఎల్​హెచ్​పీ దివ్యరాణి , హెల్త్ అసిస్టెంట్ జి.రమేశ్, ఏఎన్ఎం విజయ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.