పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ : కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు

మంచిర్యాల, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లీటరు నీటిని తీసుకోకుండానే రాష్ట్రంలో కోటిన్నర లక్షల టన్నుల వడ్లు పండించామని తెలిపారు. 

బీఆర్ఎస్​హయాంలో రైతులు ఎంతో నష్టపోయారని, అప్పటి ఎమ్మెల్యే దివాకర్​రావు ప్రతి స్కీమ్​లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 16 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచిందన్నారు. రూ.2లక్షల రుణమాఫీ 89 శాతం పూర్తయ్యిందని అన్నారు. అనంతరం 155 మందికి సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు గోదావరి ఒడ్డున కడుతున్న వైకుంఠధామం, ఐబీలోని సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్​పనులను ఎమ్మెల్యే పీఎస్సార్​ పరిశీలించారు.