అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

  • గత నెలలో 9‌‌‌‌00 కిలోల గంజాయి పట్టుబడిన కేసులో నిందితులు

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఓ అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఆదిలాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. గత నెల తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద 9‌‌‌‌00 కిలోల గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు గురుదయాల్ సాబ్లే, శుభం గోతిరాం సాబ్లే, అమర్ సింగ్ నారాయణ గోతి, సోమనాథ్ బికా సాబ్లే అరెస్ట్​చేశారు. 

వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు, గత నెలలో గంజాయి కేసులో పట్టుబడిన వెహికల్​కు ఎస్కార్ట్​గా ముందుండి నడిపిన వ్యానును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆ కేసులో ప్రధాన సూత్రధారితోపాటు మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన జైనథ్ సీఐ డి.సాయినాథ్, రూరల్ సీఐ కె.ఫణిధర్, ఎస్​ఐ ముజాహిద్, సిబ్బందిని ఎస్పీ గౌస్ ఆలం అభినందించినట్లు తెలిపారు.