అడవులను రక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : ఎఫ్​డీపీటీ శాంతరాం

జన్నారం, వెలుగు: అడవులను రక్షించడంలో నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవని ఎఫ్​డీపీటీ శాంతరాం హెచ్చరించారు. కవ్వాల్ టైగర్ జోన్ తాళ్లపేట రేంజ్​లోని తానిమడుగు బీట్​లో చెట్లు నరికివేతకు గురైన ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు.

 అడవులను రక్షించడంలో ఫారెస్ట్ సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని, చెట్లను నరికిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆయన వెంట మంచిర్యాల డీఎఫ్​వో శివ్ అశిశ్ సింగ్, తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుస్వారావు, ఇందన్ పల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులున్నారు.