బెల్లంపల్లి, వెలుగు: ఈనెల 18న మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో ధర్నాను భవన నిర్మాణ కార్మికులు విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్ పిలుపునిచ్చారు. శనివారం బెల్లంపల్లి కాంటాచౌరస్తాలో భవన నిర్మాణ రంగ కార్మికులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ ధర్నా తరువాత ఈ నెల 23న హైదరాబాద్‌లోని లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమలం భవన నిర్మాణ కార్మిక సంఘాల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు వి.మల్లయ్య, లీడర్లు ఏ.రమేశ్ పాల్గొన్నారు.