జోగిపేట, వెలుగు: జోగిపేట మీదుగా రైల్వేలైన్నిర్మాణంపై కదలిక మొదలైందని జోగిపేట రైల్వేలైన్ సాధన సమితి కన్వీనర్గంగా జోగినాథ్ అన్నారు. సోమవారం రైల్వేశాఖ డిప్యూటీ జీఎం శ్రీధర్‌ను కలువగా తుది దశ సర్వే కోసం హామీ ఇచ్చినట్లు చెప్పారు. గతంలో మొదటి దఫా సర్వే పనులు పూర్తయినా కొన్ని మార్పులతో తుది దశ సర్వే చేయించనున్నట్లు డీజీఎం చెప్పినట్లు వివరించారు.
గతంలో ప్రతిపాదించిన దాని ప్ర కారం వట్టినాగులపల్లి, సంగారెడ్డి, జోగిపేట, మెదక్ ఒకటి కాగా వట్టినాగులపల్లి, సంగారెడ్డి, జోగిపేట, నారాయణ్‌ఖేడ్, మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం సర్వే జరిగినట్లు తెలిపారు. ఈ విషయంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావును కలువగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.