చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోలకు పాలాభిషేకం

కోల్​బెల్ట్​:మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో  నేషనల్ హైవే –63 రహదారిలో కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోటోలకు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాలాభిషేకం నిర్వహించారు. 

 కొత్త బీటీ రోడ్డు ఏర్పాటుకు  రూ.1.80కోట్ల మంజూరు చేసి,   కేవలం 10 రోజుల్లోనే  4 కి.మీ దూరం  బీటీ రోడ్డు నిర్మాణపనులు కంప్లీట్​చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.  బీటీ రోడ్డు నిర్మాణం పట్ల ప్రయాణికులు, వాహనదారులు ఎంపీ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.