పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గాలి : సీఐఐ

  • ఇన్‌‌‌‌ఫ్లేషన్ దిగిరావాలన్న, వినియోగం పెరగాలన్న ఇదే మార్గం: కేంద్రానికి సీఐఐ సలహా

న్యూఢిల్లీ:  పెట్రోల్‌‌‌‌, డీజిల్ వంటి ఇంధనాలపై రానున్న బడ్జెట్‌‌‌‌లో  ఎక్సైజ్‌‌‌‌ డ్యూటీ తగ్గించాలని కాన్ఫడరేషన్ ఆఫ్​ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కేంద్రానికి సలహా ఇచ్చింది. పెట్రోల్‌‌‌‌, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడంతో ఇన్‌‌‌‌ఫ్లేషన్ గరిష్టాల్లో ఉందని, వినియోగం పుంజుకోవాలంటే ఎక్సైజ్ ట్యాక్స్‌‌‌‌ను తగ్గించాలని  తన బడ్జెట్ రికమండేషన్స్‌‌‌‌లో పేర్కొంది. దీంతో పాటు ఏడాదికి రూ.20 లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారికి రిలీఫ్ ఇచ్చేందుకు  ట్యాక్స్ రేట్లను కొద్దిగా తగ్గించాలంది. సీఐఐ రిపోర్ట్ ప్రకారం, ట్యాక్స్ తగ్గిస్తే వినియోగం పెరుగుతుంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. 

ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఎక్కువగా ఉండడంతోనే  దిగువ, మధ్య ఆదాయ వర్గాలు ఖర్చు చేయడం తగ్గించేశారు. వీరి కోసం వోచర్లు తీసుకురావాలి.  కొన్ని రకాల ప్రొడక్ట్‌‌‌‌లు, సర్వీస్‌‌‌‌లు కొనుగోలు చేసేటప్పుడు ఈ వోచర్లు వాడుకునేలా చేయాలి..   ‘పెట్రోల్‌‌‌‌ రిటైల్ ధరలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వాటానే 21 శాతంగా ఉంది. డీజిల్‌‌‌‌ ధరలో 18 శాతంగా ఉంది. 2022 మే తర్వాత నుంచి ఈ ట్యాక్స్‌‌‌‌లో ఎటువంటి మార్పు లేదు. ఇదే టైమ్‌‌‌‌లో గ్లోబల్‌‌‌‌గా క్రూడ్ ధరలు  40 శాతం మేర పడ్డాయి.  ఫ్యూయల్‌‌‌‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే ఇన్‌‌‌‌ఫ్లేషన్ దిగొస్తుంది. ప్రజల దగ్గర డబ్బులు పెరుగుతాయి’ అని సీఐఐ వివరించింది.  వీటితో పాటు ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న రోజువారి కనీస వేతనం రూ.267 నుంచి రూ.375 కి పెంచాలని, పీఎం కిసాన్‌‌‌‌ కింద ఏడాదికి ఇస్తున్న అమౌంట్‌‌‌‌ను ప్రస్తుతం ఉన్న రూ.6 వేల నుంచి రూ.8 వేలకు పెంచాలని తెలిపింది.