నేరడిగొండ హోటళ్లలో శుభ్రత పాటించకపోతే చర్యలు : సీఐ భీమేశ్

నేరడిగొండ, వెలుగు: హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇచ్చోడ సీఐ భీమేశ్ హెచ్చరించారు. నేరడిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో దాబా, హోటళ్లు,  బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చికెన్, మటన్ షాపుల ఓనర్లతో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. కుళ్లిపోయిన చికెన్, మటన్ అమ్మినా, గడువు తీరిన పదార్థాలు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యర్థాలను రోడ్లపై వేయొద్దన్నారు. నేరడిగొండ ఎస్​ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.