మెదక్ జిల్లా తూప్రాన్ లో ఓ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. పాపం రైతు అని కూడా చూడకుండా ఆయన మెడలోంచి మూడు తులాల బంగారాన్ని దొంగిలించుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన నర్ర వీరయ్య అనే రైతు హైదరాబాద్ ఎర్రగడ్డలో కూరగాయల వ్యాపారి చేస్తుంటాడు. వారానికి ఒకసారి ఇంటికి వస్తుంటాడు.
ఈ క్రమంలో జూన్ 27వ తేదీ గురువారం రోజున ఇంటికి వస్తున్న క్రమంలో తూప్రాన్ బస్టాండ్ లో వీరయ్య దిగిన వెంటనే ఒక యువకుడు వీరయ్య మెడలో గొలుసు, చేతికి ఉన్న ఉంగరాలను చూసి వెంబడించాడు. కొద్దిగా దూరం వెళ్లాక మెడలోని గొలుసును తీసి బ్యాగులో వేసుకొమ్మని వీరయ్యను బెదిరించాడు.
ఎందుకని వీరయ్య అడుగగా, పోలీసులు చూస్తే రూ.2 వేలు ఫైన్ వేస్తారంటూ బెదిరించాడు. ఇంత పెద్ద గొలుసు వేసుకొని తిరగొద్దు తెలియదా అంటూ బెదిరించాడు. దాంతో వీరయ్య గొలుసును తీసి తన బ్యాగులో వేసే క్రమంలో అపహరించాడు దుండగుడు. దీంతో బాధితుడు వీరయ్య తుఫ్రాన్ పోలీసులను ఆశ్రయించాడు.