ఇండియాలో కెనాన్ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల తయారీకి బోలెడు అవకాశాలు ఉన్నాయని కెమెరాల తయారీ కంపెనీ కెనాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. కెమెరాల్లో వాడే లిథియోగ్రఫీ సెమికండక్టర్లను ఇక్కడ తయారు చేసే ఆలోచనలో ఉంది. ఇండియాలో ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి వివిధ కంపెనీలతో చర్చిస్తున్నామని కెనాన్ ఇండియా ప్రెసిడెంట్ తొషియకి నొమురా పేర్కొన్నారు. ఏయే కంపెనీలతో చర్చిస్తున్నారో ప్రకటించలేదు.  ‘చాలా సెమీకండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఇండియాలో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి. వీటితో చర్చిస్తున్నాం.

చర్చలు చివరి దశలో ఉన్నాయి.  మా ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వీటికి అందిస్తాం’ అని  అన్నారు. చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేసే కంపెనీలతో టై అప్ అవుతామని, ప్లాంట్ ఏర్పాటయ్యాక తమ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను, టెక్నాలజీని అందిస్తామని పేర్కొన్నారు. ఇమేజింగ్, ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్వైలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కోర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పాటు,  చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల తయారీ, ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యానెల్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై కెనాన్ ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా మెడికల్  ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు సీటీ, ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–రే, అల్ట్రాసౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి కూడా తయారు చేయాలని చూస్తోంది.