దేశంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం

  • కేంద్ర సహాయమంత్రి నిమూబెన్‌‌ జయంతి బాయ్‌‌

రేగొండ, వెలుగు : పదేండ్లుగా దేశంలోని ప్రతి రంగం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని కేంద్ర సహాయ మంత్రి నిమూబెన్‌‌ జయంతిబాయ్‌‌ బంబానియా చెప్పారు. బుధవారం ఆమె జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గణపురం మండలం చెల్పూర్‌‌లోని మిల్లెట్‌‌ యూనిట్‌‌ కంపెనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. 

దేశంలోని ప్రతి పల్లెను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోందన్నారు. భారత్‌‌ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, మూడో స్థానాన్ని సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో అత్యంత వెనుకబడిన 112 జిల్లాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నీతి ఆయోగ్‌‌ యాస్పిరేషన్‌‌ జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. ‘సబ్​కా సాత్, సబ్​కా వికాస్’ నినాదంతో అందరూ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ రాహుల్‌‌శర్మ, అడిషనల్‌‌ సెక్రటరీ ఖుష్భూ, కాటారం సబ్‌‌ కలెక్టర్​మయాంక్​సింగ్, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ అశోక్‌‌కుమార్‌‌, విజయలక్ష్మి, ఆర్డీవో మంగిలాల్‌‌ 
పాల్గొన్నారు.