నిర్మల్​ను క్రీడల వేదికగా తీర్చిదిద్దుతా : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

  • బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
  • సీఎం కప్ క్రీడాజ్యోతికి ఘన స్వాగతం 

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రాన్ని రాష్ట్రంలోనే ప్రధాన క్రీడా వేదికగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం కప్ క్రీడా జ్యోతి ఆదివారం నిర్మల్​కు చేరుకున్న నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో దాగి ఉన్న క్రీడాకారులను వెలికి తీయాలన్నారు. 

ఎంతోమందిలో క్రీడా నైపుణ్యం ఉంటుందని, అలాంటివారిని గుర్తించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎ. క్రీడలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

దసరా వేడుకల ఏర్పాట్ల పరిశీలన 

స్థానిక మహాలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించనున్న దసరా వేడుకల ఏర్పాట్లను మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తో కలిసి పరిశీలించారు. ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.