నాణ్యమైన విద్యను అందిద్దాం : పొన్నం ప్రభాకర్

  • మంత్రి పొన్నం ప్రభాకర్

పటాన్ చెరు, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు. బుధవారం పటాన్ చెరు పాటి చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రికగ్నైజ్డ్  స్కూల్స్​ మేనేజ్​మెంట్​ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర జనరల్  బాడీ మీటింగ్ లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 60 శాతం స్టూడెంట్స్ ప్రైవేట్​లోనే చదువుతున్నారన్నారు. ప్రైవేట్ స్కూళ్లల్లో సేవలు మరింత మెరుగుపడేలా చూడాలన్నారు.

 పేరెంట్స్​ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం గర్వకారణమన్నారు. ప్రైవేట్​ యాజమాన్యాలు వ్యాపార దృష్టితో కాకుండా విద్యాబుద్దులు నేర్పిస్తున్నామనే భావనతో ఉండాలన్నారు. డిమాండ్లు, సలహాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

 పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్​ స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. మధుసూధన్, రాష్ట్ర కార్యదర్శి ఎన్. రమేశ్ రావు, ట్రెజరర్  పి రాఘవేందర్​రెడ్డి, విలియం జెమ్స్, ప్రభాకర్​రెడ్డి, సాయితేజ, ఉమా మహేశ్వర్రావు 
పాల్గొన్నారు.