చదువుతోనే అభివృద్ధి సాధ్యం: ఎస్పీ

తిర్యాణి, వెలుగు: భవిష్యత్ తరాలు మారాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా చదువుతోనే సాధ్యమని ఆసిఫాబాద్​ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిర్యాణి మండలం లోని మంగి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మందులు, 500 మందికి దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు.

చదువును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. శాంతిభద్రత  కోసం జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభి వృద్ధి కోసం పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ డీఎస్పీ కరుణాకర్, రెబ్బెన సీఐ బుద్దె స్వామి, తిర్యాణి ఎస్ఐ మాధవ్, డాక్టర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.