- రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
- రాష్ట్ర మైన్స్, మినరల్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ అనిల్
ఖానాపూర్, వెలుగు: అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ చేస్తున్న కృషితో ప్రజల్లో క్రేజ్ పెరిగిందని రాష్ట్ర మైన్స్, మినరల్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ఎమ్మెల్యే వెడ్మ జొజ్జు పటేల్‌తో కలిసి అనిల్పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలు చేసి చూపించిందన్నారు. 10 నెలల్లోనే 53 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పాలించిన పదేండ్లలో సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా అందలేదని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలోని అన్ని వనరులను దోచుకుని వేల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు, ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. బొజ్జు పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుడు దయానంద్, రమేశ్, నాయకులు కావలి సంతోష్, శంకర్, యూసుఫ్ ఖాన్, తోట సత్యం, జహీర్, ఖాజా, ఆసిఫ్ అలీ, సతీశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అమంద శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.