ఇంకో 5 ఏళ్లలో టాటా పవర్ పెట్టుబడులు రూ.1.46 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: కెపాసిటీని పెంచుకోవడానికి  రూ.1.46 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని టాటా పవర్ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో కంపెనీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్డ్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీని 32 గిగావాట్లకు పెంచుకుంటామని కంపెనీ సీఈఓ ప్రవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిన్హా అన్నారు. 2023–24 లో టాటా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ 15.6 గిగావాట్లుగా ఉంది. ఇందులో 6.7గిగావాట్లు రెన్యూవబుల్ సోర్స్‌‌‌‌‌‌‌‌ల  నుంచి ఉత్పత్తి అవుతోంది. 

2030 నాటికి కెపాసిటీని 31.9  గిగావాట్లకు పెంచుకోవడంపై కంపెనీ టార్గెట్ పెట్టుకుంది. ఇందులో 23 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్‌‌‌‌‌‌‌‌ల నుంచి ఉంటుంది’ అని ప్రవీర్ వివరించారు.  టాటా పవర్ కరెంట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో కూడా పనిచేస్తోంది. 

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ లైన్స్‌‌‌‌‌‌‌‌ను 2023–24లో ఉన్న 4,633 కి.మీల నుంచి 10,500 కి.మీలకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో కస్టమర్లను ప్రస్తుతం ఉన్న 1.25 కోట్ల నుంచి 4 కోట్లకు పెంచుకోవాలని చూస్తోంది. 2024–25లో రూ.21 వేల కోట్లు, 2025–26లో రూ.26 వేల కోట్ల క్యాపెక్స్‌‌‌‌‌‌‌‌ను కేటాయించింది. ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల రెవెన్యూ, రూ.పది వేల కోట్ల నికర లాభాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.  2023–24 లో రూ.61,542 కోట్ల రెవెన్యూపై రూ.4,100 కోట్ల నికర లాభం వచ్చింది.