- జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
కొండమల్లేపల్లి.వెలుగు. బీఆర్ఎస్ సీనియర్ లీడర్, కొండమల్లేపల్లి జడ్పీటీసీ పసునూరి సరస్వతి సుమారు వందమంది అనుచరులతో కాంగ్రెస్లో చేరారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సమక్షంలో హైదరాబాద్లో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ కృషి చేస్తోందని అన్నారు.
పేదల బతుకులను మార్చేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు కష్టపడుతున్నారన్నారు. కార్యకర్తలు గట్టిగా పని చేసి పార్లమెంట్ఎన్నికల్లో కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధిసాధ్యమని, మండల అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరినట్టు సరస్వతి అన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.