మిషన్ భగీరథ నీటికి  3 రోజులు అంతరాయం

చౌటుప్పల్, వెలుగు : మిషన్ భగీరథ  సరఫరాకు మూడు రోజులు అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  లక్ష్మినారాయణ ప్రకటనలో తెలిపారు. బుధవారం చౌటుప్పల్, వలిగొండ రహదారి ప్రధాన కూడలిలో జరుగుతున్న అభివృద్ధి పనులులో భాగంగా వర్కట్పల్లి, తాళ్లసింగారం, నేలపట్ల, చిన్నకొండూరు కు సరఫరా చేసే పైపులైన్ మరమతులు జరుగుతున్నాయని  చెప్పారు.

దీంతో     9,10,11 తేదీల్లో  నీళ్లు రావని, ప్రజలు సహకరించాలని కోరారు.