ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • జడ్పీ సీఈవో చందర్​నాయక్

​ సదాశివనగర్, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో చందర్​నాయక్​ అన్నారు. మంగళవారం సదాశివనగర్ మండలం ఉత్తునూర్ లో పశువులపాక, యాచారం, తిమ్మోజివాడి గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు, రాజ్యంగ దినోత్సవం సందర్భంగా  మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకంలో కొత్త పనులను ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా  వంద రోజులు పనులు పూర్తి చేసిన కూలీలను సన్మానించినట్లు తెలిపారు. 

కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్​ కుమార్, ఎంపీవో సురేందర్​ రెడ్డి, ఎంపీసీ చైర్మన్​ సంగ్యా నాయక్​, ఎపీవో శ్రీనివాస్, ఈసీ మధు, కార్యదర్శి రాహుల్​ గౌడ్​, ఫీల్డ్​ అసిస్టెంట్​మొగుళ్ల నర్సాగౌడ్, మాజీ ఎంపీటీసీ రాంచందర్​రావు  తదితరులుపాల్గొన్నారు. .