జగదాంబిక సేవాలాల్​మందిరంలో చోరీ

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండలం వడ్డాపల్లి గ్రామంలోని జగదాంబిక సేవాలాల్​ మందిరంలో చోరీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి తల్వార్, జగదాంబిక అమ్మ వారి మూడున్నర తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు దొంగిలించినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.

ఈ విషయమై ఆలయ కమిటీ సభ్యులు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎడపల్లి పోలీసులు ఆలయాన్ని పరిశీలించి సీసీ కెమెరాల పుటేజీని సేకరించారు. ఫుటేజీని పరిశీలించి ఓ వ్యక్తి చొరబడి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు చెప్పారు.