జొమాటో గుడ్‌న్యూస్ : ఓన్లీ వెజ్, ఫ్యూర్ వెజ్ మోడ్స్ వచ్చేశాయ్..

ప్రముఖ ఫుడ్ డిలివరీ ఫ్లాట్ ఫ్లాం శాఖాహరులకు శుభవార్త చెప్పింది. జొమాటో యాప్ లో కొత్త అప్‌డేట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ పోస్ట్ లో ప్రకటించారు. అందులో వెజిటేరియన్స్ కోసం కొత్తగా ఫ్యూర్ వెజ్ మోడ్, ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఫీచర్స్ వస్తున్నాయ్ అని తెలిపారు. 100% వెజిటేరియన్ ఫుడ్ గ్రీన్ కలర్ బాక్స్ లో శాఖాహారుల కోసం డెలవరీ చేస్తామన్నారు ఇదే ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆప్షన్. ఇక ఫ్యూర్ వెజ్ మోడ్ సెలక్ట్ చేసుకుంటే కేవలం వెజిటేరియన్ రెస్టారెంట్లే లిస్ట్ లో కనిపిస్తాయట. మాంసాహార పదార్థాలు తయారు చేసే హోటల్స్ ఇక్కడ చూపించదు. 

దీని కోసం ప్రత్యేకంగా గ్రీన్ కలర్ లో డెలివరీ బాక్స్ లు తెస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రీన్ బాక్స్ లో నాన్ వెజ్ ఐటమ్స్ చేరదని దీపిందర్  తెలిపారు. ఈ ఫీచర్ మరి కొన్ని వారాల్లో దేశమంతటా దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే స్పెషల్ కేక్ లు బుక్ చేసుకున్నవారికి డెలవరీ సమయంలో అవి చెదిరిపోయి వస్తున్నాయి.. అందుకోసం జొమాటో హైడ్రాలిక్ బ్యాలెన్డ్స్ సిస్టమ్ ను తీసుకొచ్చే పనిలో ఉందని అన్నారు. దీంతో కేక్ ఖరాబ్ కాకుండా మీ దగ్గరకు చేర్చుతామని అన్నారు.

ALSO READ :- స్కూలు సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం.. పరుగులు తీసిన విద్యార్థులు