ఇస్రో కొత్త చైర్మన్గా వి.నారాయణన్

ఇస్రో కొత్త చైర్మన్గా వి.నారాయణన్ నియమితులయ్యారు. ఎం.సోమ్ నాథ్ స్థానంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్ గా , అంతరిక్ష శాఖ కార్యదర్విగా వి.నారాయణన్ ను భారత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం లిక్విడ్ ప్రోపల్టన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్నారు.

నారాయణన్ జనవరి 14 బాధ్యతలు చేపట్టి ప్రారంభమై రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో నారాయణన్.. GSLV Mk III కోసం CE20 క్రయోజనిక్ ఇంజిన్ తో సహా ప్రధాన ఇస్రో ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు.  

LPSC డైరెక్టర్‌గా భారతదేశ అంతరిక్ష పరిశోధనలో కీలకమైన GSLV Mk III కోసం CE20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. నారాయణన్ నేతృత్వంలో LPSC వివిధ ఇస్రో మిషన్ల కోసం183 లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, కంట్రోల్ పవర్ ప్లాంట్‌లను విజయవంతంగా పంపిణీ చేసింది.

ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్, GSLV Mk-III మిషన్లతో సహా కీలకమైన ఇస్రో ప్రాజెక్టు్ల్లో నారాయణన్ గణనీయమైన కృషి ఉంది. నారాయణన్ విజయాలకు గాను ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి శ్రీ అవార్డు, IIT ఖరగ్‌పూర్ నుండి విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డుతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. ఇస్రో చైర్మన్ నారాయణన్ ను నియమిస్తూ క్యాబినెట్ సెక్రటరీ మనీషా సక్సేనా నియామక ఉత్తర్వులను జారీ చేశారు.